తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం..వాళ్లను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్

 తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం..వాళ్లను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.  కాంగ్రెస్‌ను వీడినవారిని తిరిగి చేర్చుకోవాలని  సెప్టెంబర్ 8న జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో భట్టి ప్రతిపాదించారు. భట్టి ప్రతిపాదనకు TPCC కార్యవర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
 
కాంగ్రెస్ పార్టీని వీడిన వారు అంటే ఎన్నికలు ముందు టికెట్ ఆశించి రాని వారు..మనస్పర్థల వల్ల పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల తర్వాత చాలా మంది కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా పలువురు బీజేపీ, బీఆర్ఎస్ లో ఉన్నారు. వీరిని కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.  

  పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్‌‌‌‌రెడ్డి, చెరుకు సుధాకర్‌‌‌‌‌‌‌‌, పీజేఆర్ కొడుకు విష్ణువర్దన్‌‌‌‌రెడ్డి, మానవతారాయ్, గద్వాల్‌‌‌‌కు చెందిన కురువా విజయ్‌‌‌‌కుమార్, మర్రి శశిధర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి వంటి  పలువురు కీలక నేతలు ఎన్నికల ముందు  కాంగ్రెస్ ను వీడిన వారి లిస్టులో ఉన్నారు.