హైదరాబాద్: దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ త్యాగాలను మరిపించడానికి బీజేపీ నేతలు ఆయనపై చెడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రధాని కావాలని ఆయన స్వాతంత్ర్య పోరాటం చేయలేదని స్పష్టం చేశారు. గాంధీ భవన్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కోరుకున్నారు కాబట్టే నెహ్రూ పీఎం అయ్యారని చెప్పారు. ప్రధానిగా ఆయన దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని వివరించారు. ఆయన లౌకికవాదాన్ని విశ్వ సించేవారని, ప్రణాళిక బద్దంగా ఆర్థిక పురోగ తికి కృషి చేశారన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ లేదని.. ఇప్పుడు గాంధీ కుటుంబంపై కావాలనే చెడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మోదీ కోరుకుంటే ప్రధాని పీఠంపై కూర్చున్నారని, రెండు పర్యాయాలు ఈవీఎంలు వాటంతట అవే ఓటు వేసుకున్నందున బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. స్వతంత్రం వచ్చిన రోజుల్లో దేశంలో ఆకలి చావులు లేకుండా చేసింది నెహ్రు అయితే... జనాల్లోకి బ్యాంకు సేవలను తీసుకొచ్చింది ఇందిరాగాంధీ అన్నారు.
నెహ్రూ ప్రధాని అయ్యాక ప్రజలు మూడు పూటలా భోజనం చేసేలా చేసి... 200 దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి చేర్చిన ఘనత నెహ్రూది.. రాహుల్ గాంధీ తాత ముత్తాతలు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు దేశ ప్రజలే తన కుటుంబం గా పరిపాలించారు.అదీ వాళ్ళ చరిత్ర. శ్రీరాముడి ఆలోచన ఆదర్శాలకు అనుగుణంగా పరిపాలించిన చరిత్ర మహాత్మా గాంధీ, నెహ్రూది. శ్రీరాముడి విగ్రహం ముందు పెట్టుకుని ఓట్లేసుకుని ప్రధాని అయిన చరిత్ర మోడీది.. దేశ ప్రజల్లో నెహ్రూ చరిత్ర కనపడకుండా చేసే కుట్ర డిల్లీ బీజేపీ చేస్తుంది..
