
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీల అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 22తో నామినేషన్ల గడవు ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎన్ఎస్ యూ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్డర్ కాపీ తీసుకున్నారు మహేశ్ గౌడ్, బల్మూరి వెంకట్.
అనంతరం మాట్లాడిన బల్మూరి వెంకట్.. అతి చిన్న వయసులో తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి,నిరుద్యోగులకు,ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా ఉంటానన్నారు.
తన సేవలు గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే పదవులొస్తాయన్నారు.
Unanimously elected as MLC. IT minister Shri @OffDSB garu and TPCC Working President, MLC Shri @Bmaheshgoud6666 were present while receiving the order copy.
— Venkat Balmoor (@VenkatBalmoor) January 22, 2024
I thank the whole leadership of @INCIndia , @INCTelangana , @nsui , @TSNSUI fraternity and the students community of… pic.twitter.com/Kj5N5Je3c2