ఆశ్రమ స్కూళ్ల సమస్యలు పరిష్కరించాలి.. గిరిజన శాఖ జేడీకి టీపీటీఎఫ్ నోటీసు

ఆశ్రమ స్కూళ్ల సమస్యలు పరిష్కరించాలి.. గిరిజన శాఖ జేడీకి టీపీటీఎఫ్ నోటీసు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆశ్రమ స్కూళ్లలోని టీచర్లు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు చేస్తామని టీపీటీఎఫ్  రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చకినాల అనిల్ కుమార్, ఎన్.తిరుపతి తెలిపారు. ఈ మేరకు గురువారం గిరిజన సంక్షేమ శాఖ జేడీ దిలీప్ కుమార్​కు నోటీసు అందించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు అందించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. 

దీంతో మూడు దశలుగా ఆందోళన చేయాలని నిర్ణయించామని వివరించారు. నవంబర్ 12 , 13న స్కూళ్ల ముందు, 24న ఐటీడీఏ ఆఫీసుల ముందు, డిసెంబర్ 12న కమిషనర్  ఆఫీసు ముందు నిరసన ప్రదర్శనలు చేపడతామని తెలిపారు. అలాగే కాంట్రాక్టు టీచర్లను రెగ్యులరైజ్  చేయాలని డిమాండ్  చేశారు.