
- టీపీటీఎల్ఎఫ్రాష్ట్ర అధ్యక్షుడు ఏ. విజయ్ కుమార్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇంటర్మీడియెట్ కాలేజీలకు కూడా స్కూల్స్ కి ఇచ్చినట్టు10రోజులకు పైగా సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం టీపీటీఎల్ఎఫ్ నేతలు ఇంటర్మీడియెట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ. విజయ్ కుమార్ మాట్లాడారు.
తెలంగాణలో దసరా అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన పండగ అని, అలాగే బతుకమ్మ సంబురాలను కూడా తొమ్మిది రోజులు ప్రజలు ఘనంగా జరుపుకుంటారని , దీన్ని దృష్టిలో ఉంచుకొనే స్కూళ్లకు దాదాపు 15రోజుల వరకు సెలవులు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులు, టీచర్స్ కి కూడా 10రోజులకు పైగా సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కె. విజయ్, డీవైఎఫ్ వై హైదరాబాద్ ఉపాధ్యక్షుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు.