
హైదరాబాద్: హైదరాబాద్ వాసులకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. 2025, మే 5న ఐపీఎల్ 18లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం పరిసరాల్లో లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్లు, వాటర్ ట్యాంకర్లు, RMC ట్రక్కుల వంటి భారీ వాహనాలపై నిషేధం విధించారు. మే 5 సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 11:50 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ప్రజలు, వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని తమకు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ డైవర్షన్స్:
- రామంతపూర్ నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు స్ట్రీట్ నెంబర్ 8 మీదుగా ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వెళ్లాలి.
- చెంగిచెర్ల–బోడుప్పల్–పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వెహికల్స్ టయోటా షోరూమ్ ముందు నుంచి హెచ్‌ఎండీఏ భగాయత్ రోడ్డు మీదుగా నాగోల్ వైపు మళ్లిస్తారు.
Also Read : ఒక్క టెస్ట్ ఆడకపోయినా ఇంగ్లాండ్ సిరీస్‌కు అతన్ని సెలక్ట్ చేయండి
- ఎల్‌బి నగర్ నుంచి నాగోల్/ఉప్పల్ వెళ్లే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ కింద ఉన్న యు-టర్న్ వద్ద హెచ్‌ఎండీఏ లేఅవుట్, బోడుప్పల్ వైపు మీదుగా చెంగిచెర్ల ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్ మళ్లించబడుతుంది.
- తార్నాక నుంచి ఉప్పల్ వచ్చే వెహికల్స్ హబ్సిగూడ ఎక్స్ రోడ్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని నాచారం, ఐఓసిఎల్ చెర్లపల్లి, స్ట్రీట్ నెం. 8, హబ్సిగూడ, మెట్రో పిల్లర్ 972 యు-టర్న్ ద్వారా ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వాహనాలను మళ్లిస్తారు.