IND vs ENG: ఒక్క టెస్ట్ ఆడకపోయినా ఇంగ్లాండ్ సిరీస్‌కు అతన్ని సెలక్ట్ చేయండి: రవిశాస్త్రి

IND vs ENG: ఒక్క టెస్ట్ ఆడకపోయినా ఇంగ్లాండ్ సిరీస్‌కు అతన్ని సెలక్ట్ చేయండి: రవిశాస్త్రి

భారత క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నప్పటికీ మరో రెండు నెలల్లో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ మీదే ఎక్కువ చర్చ జరుగుతుంది. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు టీమిండియా టెస్ట్ ను మే రెండో వారంలో ప్రకటించనున్నారు. ఈ సిరీస్ కు ఎవరు ఎంపికవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో రహానే, పుజారా లేకపోవడంతో వీరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారో సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. బ్యాకప్ ఓపెనర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో తీవ్ర చర్చ జరుగుతుంది. 

మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ను  ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయాలని సూచించాడు. గతంలో ఇంగ్లాండ్ గడ్డపై సర్రే తరఫున ఆడడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. రెండు కౌంటీ సీజన్లలో ఆడిన సుదర్శన్ బ్రిటిష్ పరిస్థితులకు అలవాటు పడ్డాడని.. ఇంగ్లాండ్ పిచ్ లపై ఉపయోగపడతాడని తెలిపాడు. సాయి సుదర్శ తో పాటు శ్రేయాస్ అయ్యర్ ను.. ఖలీల్ అహ్మద్ ను సెలక్ట్ చేయాలని తన అభిప్రాయాన్ని చెప్పాడు.   

ఐసీసీకి ఇచ్చి రివ్యూలో శాస్త్రి మాట్లాడుతూ "సాయి సుదర్శన్ అన్ని ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నాను. అతను క్లాస్ ప్లేయర్. నా కళ్ళు ఖచ్చితంగా అతనిపైనే ఉంటాయి. ఇంగ్లాండ్‌లో లెఫ్ట్ హ్యాండర్ ఉండడం.. అక్కడ ఉన్న ఇంగ్లీష్ పరిస్థితులు అర్ధం చేసుకోవడం.. అతని టెక్నీక్ ఇలా అన్నీ కలిసి వస్తాయి. ఇంగ్లాండ్ టూర్ కు ఎంపిక చేయాలంటే నాకు సంబంధించి అతను మొదటి వరుసలో ఉంటాడు. శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ లకు కంబ్యాక్ ఇవ్వాలి". అని శాస్త్రి అన్నాడు. 

►ALSO READ | GT vs SRH: డూ ఆర్ డై మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలింగ్.. గుజరాత్ జట్టులో సఫారీ పేసర్

ఇంగ్లాండ్ తో జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ అయిపోయిన వెంటనే వారం రోజుల గ్యాప్ లో భారత జట్టు ఇంగ్లాండ్ కు పయనమవనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-27 సైకిల్ లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ కు భారత జట్టును మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి ఇండియా ఎక్కువగా యంగ్ ప్లేయర్లతోనే బరిలోకి దిగబోతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది.

హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ గౌల్డ్ ఆశిస్తున్నాడు.