
ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ హైదరాబాద్ డూ ఆర్ డై మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. శుక్రవారం (మే 2) గుజరాత్ టైటాన్స్ పై అమీతుమీ తేల్చుకోనుంది. అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్ లాడిన సన్ రైజర్స్ 3 మ్యాచ్ ల్లోనే గెలిచింది. ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండాలంటే ఈ నేడు జరగబోయే మ్యాచ్ లో తప్పకుండా గెలిచి తీరాల్సిందే. "ఈ టోర్నీలో నాకు ఇంకా మాకు అవకాశాలు ఉన్నాయి. చివరి రెండు మ్యాచ్ ల్లో అద్భుతంగా ఆడాము". గెలిచే అవకాశం ఉంది. అని కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు.
ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కరీం జనత్ స్థానంలో గుజరాత్ గెరాల్డ్ కొయెట్జీని తీసుకొచ్చిది. మరోవైపు సన్ రైజర్స్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో గుజరాత్ 6 మ్యాచ్ ల్లో గెలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరువవుతుంది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ
►ALSO READ | IPL ట్రోఫీల కంటే.. RCB అభిమానుల ప్రేమే ఎక్కువ: విరాట్ కోహ్లీ