అలర్ట్.. హైదరాబాద్ లో ఈ ఏరియాలో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

అలర్ట్.. హైదరాబాద్ లో ఈ ఏరియాలో రెండు రోజులు  ట్రాఫిక్ ఆంక్షలు

 బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, రథోత్సవం సందర్భంగా జులై 2 వరకు ట్రాఫిక్ ​ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్​డేవిస్​ తెలిపారు.  గ్రీన్​ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్‌ నుంచి ఫతేనగర్‌ వైపు వెళ్లే వాహనాలను ఎస్‌ఆర్‌ నగర్‌ టీ- జంక్షన్‌ నుంచి మళ్లించి.. ఎస్‌ఆర్‌ నగర్‌ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ క్రాస్ రోడ్డు, శ్రీరామ్‌ నగర్‌, సనత్‌నగర్‌ మీదుగా ఫతేనగర్‌ వైపు అనుమతిస్తారు. 

  •  ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌ నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలను కట్టమైసమ్మ టెంపుల్ వద్ద నిర్మించిన కొత్త బ్రిడ్జి నుంచి మళ్లిస్తారు. 
  • గ్రీన్​ల్యాండ్స్‌- బకుల్‌ అపార్ట్​మెంట్స్, ఫుడ్​వరల్డ్‌ నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. ఇక్కడి వాహనాలు సోనాబాయ్ టెంపుల్ నుంచి సత్యం థియేటర్ మైత్రివనం వైపుగా వెళ్లాల్సి ఉంటుంది. 
  • బేగంపేట కట్టమైసమ్మ టెంపుల్ నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలు కూడా దారి మళ్లించనున్నారు. గ్రీన్‌ల్యాండ్స్ నుంచి మాత ఆలయం, సత్యం థియేటర్, ఎస్‌ఆర్‌నగర్‌ టీ- జంక్షన్‌ వద్ద లెఫ్ట్​ తీసుకొని ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. 
  • నేరుగా ఎస్‌ఆర్‌ నగర్‌ టీ-జంక్షన్‌ నుంచి ఫతేనగర్‌ వరకు లింక్‌ రోడ్లు మూసివేశారు
  • పార్కింగ్​ ఏర్పాట్లు ఇలా..  
  • భక్తుల కోసం ఆర్అండ్​బీ, నేచర్ క్యూర్ హాస్పిటల్, జీహెచ్ఎంసీ మైదానం, పద్మశ్రీ అపార్ట్​మెంట్, ఫతేనగర్ రైల్వే వంతెన కింద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. బల్కంపేట వైపుగా వస్తున్న ఈ వాహనదారులు తప్పకుండా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.