వాహనదారులకు అలర్ట్‌.. ఈ రూట్స్‌లో వెళ్లకండి.

వాహనదారులకు అలర్ట్‌.. ఈ రూట్స్‌లో వెళ్లకండి.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా శనివారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వజ్రోత్సవాలు జరిగే ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తూ గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాహనదారులు ఇతర రూట్లలో వెళ్లాలని సూచించారు. నిర్ధేశించిన పార్కింగ్‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లోనే వెహికల్స్​ను పార్క్‌‌‌‌‌‌‌‌ చేయాలని తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. కవాడీ గూడ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌, అశోక్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముషీరాబాద్ క్రాస్‌‌‌‌‌‌‌‌ రోడ్స్‌‌‌‌‌‌‌‌, ఏబీ కాలేజీ, లిబర్టీ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహం  నుంచి ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియం వెళ్లే  రూట్​లో వెహికల్స్ కు అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఏర్పాట్లను గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పీవీ మార్గం నుంచి సభా వేదిక ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. మేడ్చల్ కలెక్టరేట్​లో జాతీయ సమైక్యత ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ హరీశ్​పరిశీలించారు. శనివారం ఉదయం కలెక్టరేట్​లో మంత్రి మల్లారెడ్డి జెండా ఎగురవేస్తారని కలెక్టర్ తెలిపారు. తర్వాత స్టూడెంట్లు, కళాకారులతో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, అధికారులు ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహించే సమైక్యత వజ్రోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి పరిశీలించారు. వేడుకలను సక్సెస్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇయ్యాల సైబరాబాద్ పరిధిలో..
గచ్చిబౌలి: జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముందస్తు వేడుకల నేపథ్యంలో ఈ నెల 16న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్ పరిధిలో (శుక్రవారం ఉ. 9 నుంచి 11 గంటల వరకు) దుండిగల్ నుంచి బాలానగర్ వైపు​వచ్చే వెహికల్స్ షాపూర్​నగర్​ నుంచి అయోధ్యనగర్​ మీదుగా కుత్బుల్లాపూర్ వై జంక్షన్ మీదుగా ​వెళ్లాల్సి ఉంటుంది. జగద్గిరిగుట్ట, గాజులరామారం నుంచి బాలానగర్ వైపు వెళ్లే వెహికల్స్ ను సైతం ఇదే రూట్​ మీదుగా దారి మళ్లిస్తారు. మియాపూర్ పరిధిలో (ఉ. 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు) కూకట్​పల్లి, అల్విన్​క్రాస్ రోడ్, ఆర్సీపురం, బీహెచ్ఈఎల్ వైపు వచ్చే వెహికల్స్ ను వన్ వేలో వెళ్లాల్సి ఉంటుంది. రాజేంద్రనగర్ పరిధిలో (ఉ. 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు) ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం.17 నుంచి ఆరాంఘర్ మీదుగా అత్తాపూర్ వైపు వచ్చే వెహికల్స్ టీఎస్పీఏ సర్వీస్ రోడ్ వద్ద రైట్ టర్న్ తీసుకుని బండ్లగూడ జాగీర్ లోని లార్డ్స్ కాలేజీ, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, కిస్మత్ పురా, బద్వేల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్​నం. 294 , పీడీపీ జంక్షన్ నుంచి వచ్చే వెహికల్స్ సైతం ఇదే రూట్​లో ప్రయాణించి టీఎస్పీఏ జంక్షన్ నుంచి హిమాయత్​సాగర్​ వైపు చేరుకోవాలి.

చేవెళ్ల ట్రాఫిక్ పీఎస్ పరిధిలో (ఉ. 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు) వికారాబాద్ నుంచి చేవెళ్ల వైపు వచ్చే వెహికల్స్ వన్ వేలో వెళ్లాలి. షాద్​నగర్​ పరిధిలో...(ఉ. 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బెంగుళూరు హైవే​నుంచి షాద్​నగర్​ వైపు వచ్చే వెహికల్స్​ను ఎన్​హెచ్​ 44 మీదుగా దారి మళ్లిస్తారు.  పరిగి నుంచి జడ్చర్ల వైపు వచ్చే వెళ్లే వెహికల్స్ ను​ ఎన్​హెచ్​ 44 మీదుగా దారి మళ్లిస్తారు.

ఎన్​హెచ్​44 హైవే నుంచి షాద్​నగర్​కు వెళ్లే వెహికల్స్ ను బైపాస్ రోడ్​ మీదుగా దారి మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి షాద్​నగర్​ వైపు వచ్చే వెహికల్స్ చటాన్​పల్లి బైపాస్​ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.  కాశీంపేట నుంచి షాద్​నగర్​పీఎస్ వైపు వెళ్లే వెహికల్స్ ను బీఎస్ఎన్ఎల్ ఆఫీసు మీదుగా దారి మళ్లిస్తారు. షాద్​నగర్​ నుంచి చటాన్​పల్లి రైల్వే స్టేషన్​ వైపు వచ్చే వెహికిల్స్​ ఎన్​హెచ్​44 మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.