
- 15న ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
- వేడుకలకు వచ్చేవారి కోసం పార్కింగ్ స్థలాల కేటాయింపు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్‌లో జరిగే వేడుకల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వరకు రోడ్లు మూసివేస్తారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
గోల్ఫ్ క్లబ్ లేన్ సమీపంలోని సెవెన్టూంబ్స్నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే ట్రాఫిక్ ను జమాలీ దర్వాజా వైపు మళ్లిస్తారు. అలాగే గోల్కొండ బస్ స్టాప్ దగ్గరున్న జీహెచ్ఎంసీ గ్రౌండ్, ఐలాండ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను మోతీ మహల్ క్రాస్ రోడ్ వైపు పంపిస్తారు. తవక్కల్స్టోర్, బడా బజార్ నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే ట్రాఫిక్ ను జీహెచ్ఎంసీ ఐలాండ్ వైపు తరలిస్తారు. ఇబ్రహీం మెడికల్ హాల్ చోటా బజార్ నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాలు మోతీ దర్వాజా వైపు వెళ్లాలి. రామ్‌దేవ్‌గూడ టీ" జంక్షన్, నార్సింగి, టిప్పు ఖాన్ బ్రిడ్జ్ నుంచి కోట వైపు వచ్చే ట్రాఫిక్ రామ్‌దేవ్‌గూడ జంక్షన్ వద్ద మళ్లిస్తారు.
పార్కింగ్ స్థలాలు
బాలా హిస్సార్ నుంచి బడా బజార్ మసీదు వరకు వీఐపీలు, మంత్రులు , ఎమ్మెల్యేల వాహనాలు పార్కి చేస్తారు. సీనియర్ ప్రభుత్వ అధికారులకు గోల్కొండ బస్ స్టాప్ వద్ద పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ఫుట్‌బాల్/బాయ్స్ గ్రౌండ్, గోల్కొండ ఎల్అండ్ఓ పీఎస్ ఎదురుగా ప్రభుత్వ , ప్రభుత్వేతర ప్రముఖుల వెహికల్స్పార్క్చేయాలి. పోలీసు ఉన్నతాధికారుల వాహనాలు జీహెచ్ఎంసీ/ఒవైసీ గ్రౌండ్ పార్కింగ్‌కు అనుమతించారు. అవార్డు గ్రహీతలు, ప్రెస్ మీడియా వారికి గోల్కొండ ఏరియా హాస్పిటల్ వద్ద పార్కింగ్కేటాయించారు. సాధారణ ప్రజలు , సందర్శకులు తమ వాహనాలను సెవెన్‌టూంబ్స్, డెక్కన్ పార్క్ , హుడా పార్క్ లోపల పార్క్చేయాల్సి ఉంటుంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద..
టివోలీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ బ్రూక్ బాండ్ , ఎన్‌సిసి జంక్షన్ వైపు మళ్లిస్తున్నారు. టివోలీ నుండి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. గోల్కొండ చుట్టుపక్కల ప్రాంతాల వారు గోల్కొండ కోటకు వెళ్లే ప్రధాన రహదారులపై ఎలాంటి వాహనాలను పార్క్ చేయవద్దని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ కోరారు.