మాదాపూర్, వెలుగు: నగరాన్ని ముసురు వీడడం లేదు. మూడు రోజులుగా అలాగే పడుతుండడంతో నగరంలో వాహనాల వేగం మందగించింది. హైటెక్‌సిటీ వైపు వచ్చే అన్నీ రోడ్లపై గురువారం వాహనాలు బారులు తీరి కనిపించాయి. ముసురుతో రోజూ బైక్‌లపై వచ్చేవారు కార్లను వాడుతుండటంతో రద్దీ పెరుగుతోంది. గురువారం ఉదయం నానక్‌రామ్‌గూడ, ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే రోడ్డు వాహనాలతో నిండిపోయింది.
జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్ రూట్, బయోడైవర్సిటీ నుంచి ఐకియా జంక్షన్మీదుగా సైబర్టవర్స్రూట్, షేక్‌పేట్ నుంచి ఖాజాగూడ రూట్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి రూట్లో ట్రాఫిక్జామయ్యింది. వరుసగా ముసురు నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్లేదా మధ్యాహ్నం 2 గంటల నుంచే ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.
ఫ్లోటింగ్ కెమెరాతో గాలింపు
నాలాలో పడిపోయిన హఫీజ్పేట్ప్రేమ్నగర్ బి బ్లాక్‌కు చెందిన బాలయ్య(70) కోసం మంగళవారం రాత్రి నుంచి గాలిస్తున్నా జాడ దొరకలేదు. హెచ్ఎండబ్ల్యూఎస్ఆఫీసర్లు చెన్నై నుంచి ప్రత్యేకంగా ఫ్లోటింగ్ కెమెరా తెప్పించి వెతుకుతున్నారు.
నాలాలో చెత్తను తొలగించి మరీ వెతుకుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. 48 గంటలు గడుస్తున్నా బాలయ్య ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు అక్కడే రోదిస్తూ ఉన్నారు.
కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
హైదరాబాద్ సిటీ : వరుసగా ముసురు పడుతుండడంతో నగరవాసులు ట్రాఫిక్ భయంతో మెట్రో కే ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే సమయం, వచ్చే టైం లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో మెట్రోలో వెళ్లేందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో సిటీలోని ఇంటర్‌ఛేంజ్ స్టేషన్అయిన అమీర్ పేట్ గురువారం కిక్కిరిసిపోయింది.
