నగరంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం

నగరంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం

హైదరాబాద్లో మళ్లీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వాన కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారి సగం వరకు వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. రోడ్డుపై గుంతల కారణంగా ఓ వాహనదారుడు నీటిలో పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. 

ఓల్డ్ సిటీలోనూ వర్షం కారణంగా జనం ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, ఫలక్నుమా, శాలిబండ, కంచన్ బాగ్, సంతోష్ నగర్లలో వాన పడింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. శంషాబాద్ పరిసరాల్లోనూ చిరుజల్లులు కురిశాయి.