పంజాగుట్ట, వెలుగు: ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు మే 20 వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ నుంచి పంజాగుట్ట జంక్షన్ వరకు ఒకవైపు, పంజాగుట్ట మార్కెట్ నుంచి ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వరకు మరోవైపు భూగర్భ డ్రైనేజీ పనులు చురుకుగా సాగుతున్నాయి.
ఈ పనుల దృష్ట్యా మే 20 వరకు ఇతర మార్గాలను ఎంచుకోవాలన్నారు. అనివార్యమైన పరిస్థితుల్లో ప్రయాణికులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626 కు కాల్ చేసి సమాచారం అందించాలని
విజ్ఞప్తి చేశారు.

