- బోనాల నేపథ్యంలో వెహికల్స్ డైవర్షన్
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలో జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాలు ఇయ్యాల ప్రారంభం కానుండగా.. 9 పూజలు జరిగే తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22, 25, 29, జులై 2, 6, 9, 13, 16, 20 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. రాందేవ్ గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే వారు మక్కా దర్వాజ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. లంగర్ హౌస్ నుంచి గోల్కొండకు వచ్చే వారు ఫతే దర్వాజ మీదుగా, సెవెన్ టూంబ్స్ నుంచి వచ్చే వారు బంజారా దర్వాజ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు
తెలిపారు.
