ఆగస్ట్ 15న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. పాస్‍లు ఉన్నవారికే ఈ రూట్లో అనుమతి

ఆగస్ట్ 15న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. పాస్‍లు ఉన్నవారికే ఈ రూట్లో అనుమతి

హైదరాబాద్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్ట్ 15న గోల్కండలో జరిగే వేడుకలకు వచ్చేవారు, వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలపై రూట్ మ్యాప్ తయారు చేశారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. గోల్కొండ పరిసరాల్లో ప్రయాణించే వారు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గమనిస్తే.. తక్కువ సమయంలో వారి గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. మంగళవారం ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకూ ఉన్న రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులు అందజేశారు. పాసులు ఉన్న వారికే ఆయా రూట్లో అనుమతి ఉంటుంది. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతి ఉంటుంది. 

  • ఏ గోల్డ్ పాసులున్న వారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేసుకోవాలి. 
  • ఏ పింక్ పాసులున్న వాహనదారులు కోట ప్రధాన ద్వారం నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్టాప్ వద్ద పార్క్ చేయాలి.
  • బీ పాసులున్న వాహనదారులు గోల్కొండ బస్టాప్ దగ్గర కుడి మలుపు తీసుకొని ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
  • సీ గ్రీన్ పాసులున్న వాహనదారులు గోల్కొండ కోట ప్రధాన ద్వారం నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఓసీ/ జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి.
  • డి, ఎరుపు పాసులున్న వారికి ప్రియదర్శిని స్కూల్లో పార్కింగ్ సదుపాయం 
  • ఎ, బ్లాక్  పాసులన్న వారు ఫతేదర్వాజా వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద పార్కింగ్ 
  • షేక్పేట, టోలీచౌకీ నుంచి వచ్చే సాధారణ ప్రజలు వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్కింగ్‌కు అనుమతి