లేడీస్ హాస్టల్ ఓనర్.. హాస్టల్లో ఉండే కొందరు అమ్మాయిలతోనే.. పెళ్లైన నెలన్నరకే భార్యకు నిజం తెలిసి..

లేడీస్ హాస్టల్ ఓనర్.. హాస్టల్లో ఉండే కొందరు అమ్మాయిలతోనే.. పెళ్లైన నెలన్నరకే భార్యకు నిజం తెలిసి..

విశాఖ: ఏపీలోని విశాఖపట్నం సిటీలో విషాద ఘటన జరిగింది. పెళ్లైన 45 రోజులుకే నవ వధువు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెలన్నర క్రితం శ్రీకాకుళానికి చెందిన సోమేశ్వర రావు, తేజశ్రీకి పెళ్లి జరిగింది. వైజాగ్ సిటీలో లేడీస్ హాస్టల్ నడుపుతూ సోమేశ్వర రావు భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే.. సోమేశ్వర రావుకు హాస్టల్లో ఉంటున్న కొందరు అమ్మాయిలతో పరిచయాలున్నాయి.

ఈ పరిచయాలు కొందరితో శారీరక సంబంధాల వరకూ వెళ్లాయి. పెళ్లికి ముందు నుంచే సోమేశ్వర రావుకు ఈ పరిచయాలున్నాయి. భార్యకు, ఆమె కుటుంబానికి డాక్ యార్డ్లో ఉద్యోగం చేస్తున్నానని సోమేశ్వర రావు నమ్మించాడు. మార్చి 6న ఇరు కుటుంబాల పెద్దలు, బంధు మిత్రుల సమక్షంలో తేజశ్రీ, సోమేశ్వర రావు పెళ్లి జరిగింది.

మే 7న అనుమానాస్పద స్థితిలో తేజశ్రీ చనిపోయింది. ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె కనిపించింది. హాస్టల్ అమ్మాయిల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న CI పైడయ్య చెప్పారు. పుట్టింటికి వెళ్లిపోవాలని తమ కూతురిని సోమేశ్వర్ వేధించాడని, ఆమె చావుకు భర్తనే కారణమని తేజశ్రీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.