బషీర్బాగ్, వెలుగు: కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా పడిపోయిన ప్రయాణికుడిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ నెల 26న రాత్రి బెంగళూరు వెళ్లడానికి వరంగల్ ప్రాంతానికి చెందిన మణిదీప్ (31) కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరాడు. జనరల్ టికెట్ తీసుకుని ఏసీ బోగి వద్ద రైలు ఎక్కాడు. తొందరపడి జనరల్ బోగికి మారాలని కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నించి పట్టాలపై పడిపోయాడు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుస్మిత, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గోవిందరావు గమనించి వెంటనే అతడిని కాపాడారు.
