V6 News

రైళ్లలో పోగొట్టుకున్న 126 ఫోన్ల రికవరీ.. సికింద్రాబాద్ లో బాధితులకు అందజేసిన పోలీసులు

రైళ్లలో పోగొట్టుకున్న 126 ఫోన్ల రికవరీ.. సికింద్రాబాద్ లో బాధితులకు అందజేసిన పోలీసులు

పద్మారావునగర్, వెలుగు: రైలు ప్రయాణాల్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్​లను రైల్వే పోలీసులు రికవరీ చేశారు. సీఈఐఆర్ పోర్టల్ సాయంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేసిన సుమారు రూ. 20 లక్షల విలువైన 126 మొబైల్ ఫోన్లను మంగళవారం సికింద్రాబాద్​లో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా రైల్వే డీఎస్పీ జావేద్ మాట్లాడుతూ.. గత మూడేండ్లలో రూ. 2 కోట్ల విలువైన 1500 ఫోన్లను రికవరీ చేసి రికార్డు సృష్టించామన్నారు. కేరళ, యూపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లను తెప్పించి బాధితులకు అందజేశామని, ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే ఐఎంఈఐ నంబర్​తో ఫిర్యాదు చేయాలని సూచించారు.