వెంకటాపూర్ (రామప్ప),వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 70 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ భారత్ దర్శన్ లో భాగంగా గురువారం సందర్శించారు.
ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, పోలీస్, రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

