ఎల్బీనగర్, వెలుగు: మీర్పేట్ ఎస్సై నాగభూషణంపై బదిలీ వేటు పడింది. లెనిన్ నగర్‌లోని తన ప్లాట్‌ను కొందరు కబ్జా చేస్తున్నారని తిరుపతయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా, ఆ కేసులో నిర్లక్ష్యం వహించడమే కాకుండా, కేసు ముందుకు వెళ్లాలంటే మద్యం సీసాతో పాటు డబ్బులు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశారు.
ఈ మేరకు బాధితుడి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్.. ఎస్సైను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్‌ను ఆదేశించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎస్సైపై తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.
