ఇక నుంచి రిజిస్ట్రేషన్ గడువు రెండు నెలలు.. అప్పటికీ నెంబర్ రాకపోతే ఆటోమేటిక్గా కేటాయింపు

ఇక నుంచి రిజిస్ట్రేషన్ గడువు రెండు నెలలు..  అప్పటికీ నెంబర్ రాకపోతే ఆటోమేటిక్గా కేటాయింపు
  • ఆలోపు చేయించకుంటే వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నెంబర్ కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ లేదా ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఎంపికకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) తేదీ నుంచి రెండు నెలల గడువు ఉంటుందని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. 

బుధవారం (జూన్ 11) రవాణా శాఖ ప్రధాన కార్యాలయం నుంచి  ఒక ప్రకటన వెలువడింది. ఇంతకు ముందు కేవలం నెల రోజులే గడువు ఉండేదని, ఇప్పుడు వాహన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ గడువును మరో నెల పొడగించినట్లు అందులో పేర్కొన్నారు. 

ఈలోపు వాహన యజమానులు తమకు నచ్చిన ఫ్యాన్సీ లేదా ప్రత్యేక నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిజర్వు చేసుకోవాలని, లేదంటే గడువు ముగిసిన వెంటనే ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆర్టీఏ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయింపు జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.