
గాంధీ భవన్ : ప్రతి పక్షాల ఉచ్చులో పడొద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం నిరుద్యోగులకు సూచించారు. యువతకు జాబ్స్ రాకుండా చేయాలని కేటీఆర్, హరీశ్ రావులు కుట్ర చేస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు. గురువారం ఆయన గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుకోవాల్సిన సమయాన్ని వృధా చేసుకోవొద్దని కోరారు.
జాబ్ క్యాలెండర్ గురించి మేధావుల అభిప్రాయం తీసుకొని త్వరలో విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. కిషన్ రెడ్డి హైదరాబాద్ ఇమేజ్ ని చెడగొట్టాలని చుస్తే ఊరుకోవమని మంత్రి అన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో రాజకీయ ఆటకోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, హైదరాబాద్ ని మంత్రి కిషన్ రెడ్డి విమర్శిస్తున్నాడని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఐదు ఏండ్లలో హైదరాబాద్ కు ఏం చేశారో, ఎన్ని నిధులు తెచ్చాడో కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్, బీజేపీ లు మిత్ర పక్షంగా ఉండి హైదరాబాద్ ను ఆగం చేసింది వాస్తవం కాదా? అని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అభివృద్ధిపై మా మంత్రి వర్గంతో చర్చకు పిలిస్తే దానికి రాలేదని తెలిపారు. హైదరాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివరించారు.