సీనియ‌‌ర్ సిటిజ‌‌న్స్‌‌ కోసం ట్రావెల్ టిప్స్

సీనియ‌‌ర్ సిటిజ‌‌న్స్‌‌ కోసం ట్రావెల్ టిప్స్

రిటైర్ అయిన చాలామంది సీనియ‌‌ర్ సిటిజ‌‌న్స్‌‌కు ట్రావెల్ చేయాలని ఉంటుంది. కానీ వాళ్ల హెల్త్ ప్రాబ్లమ్స్, సేఫ్టీ ఇష్యూస్ వల్ల చాలామంది ప్రయాణాలను వాయిదా వేస్తుంటారు. లేదా క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సీనియర్స్ ఎంచక్కా ప్రయాణాలు చేయొచ్చు. అదెలాగంటే..

సీనియర్ సిటిజన్స్ ప్రయాణాలు చేసేముందు తమ హెల్త్ కండిషన్‌‌ను చెక్ చేసుకోవాలి. అనారోగ్యం వల్ల ప్రయాణంలో ఇబ్బందులు రావొచ్చు. అందుకే బయలుదేరే ముందు డాక్టర్‌‌ను సంప్రదించాలి. కావాల్సిన మెడిసిన్స్ అడిగి తీసుకోవాలి.వెళ్తున్న ప్రదేశం గురించి ముందే తెలుసుకుని బయలుదేరాలి.  హోటల్ రూంతో పాటు రిటర్న్ టికెట్లు కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి. సీనియర్స్ ట్రావెల్ చేసేటప్పుడు బ‌‌య‌‌టి ప్రదేశాల కంటే తెలిసిన వాళ్ల ద‌‌గ్గర స్టే చేయడం మంచిది. కుదరకపోతే హోమ్ స్టే లేదా గెస్ట్ హౌస్‌‌లను ఎంచుకోవాలి.

అన్నింటికంటే ముఖ్యంగా సీనియర్స్ ఫుడ్​ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెళ్లబోయే ప్రాంతంలో దొరికే ఫుడ్ గురించి ముందే తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు డైట్ ప్లాన్ చేసుకోవాలి. సీనియర్స్ ఫ్లైట్ జర్నీ చేయాల్సి వస్తే హెల్త్ సర్టిఫికెట్ దగ్గర పెట్టుకోవాలి. తక్కువ లగేజీ తీసుకెళ్లాలి. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిది.  సీనియర్స్ ట్రావెల్ చేసేటప్పుడు మెడిక‌‌ల్ ప్రిస్క్రిప్షన్స్, మందులు, మెడిక‌‌ల్ కిట్, స్నాక్స్‌‌, నీళ్లు ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. అలాగే వెళ్లబోతున్న ప్రదేశం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాలి. మొబైల్ కనెక్టివిటీ ఉండే ప్లేసులనే ప్రయాణానికి ఎంచుకోవాలి.