లక్నో: ఇండియా డబుల్స్ షట్లర్లు ట్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్ సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్–300 టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో మార్గోట్ లాంబెర్డ్– కామిల్లె పోగ్నాంటే మ్యాచ్ నుంచి తప్పుకోవడం ఇండియా ద్వయానికి వాకోవర్ లభించింది.
విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో రెండో సీడ్ తన్వీ శర్మ 21-–19, 18–-21, 21–-14 తేడాతో ధిండా అమర్త్య ప్రతివి (ఇండోనేసియా)పై, మూడో సీడ్ ఉన్నతి హుడా 21–19, 15–21, 21–18తో అన్మోల్ ఖర్బ్‌పై గెలవగా, తస్నిమ్ మీర్ 11–-21, 11–-21తో రికో గుంజి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి–రేషిక ఉదయసూర్యన్ జంట 21–-8, 21–-14తో విరాజ్ కువాలె-రు–తపర్ణ పాండాపై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టారు. మెన్స్ సింగిల్స్‌లో తుషార్ సువీర్ 21–-19, 19–-21, 9–-21తో ప్రహిద్‌స్కా బగస్ షుజివో (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు.
