పెండింగ్ సమస్యలు పరిష్కరించండి..మంత్రి పొంగులేటికి ‘ట్రెసా’ వినతి

పెండింగ్ సమస్యలు పరిష్కరించండి..మంత్రి పొంగులేటికి ‘ట్రెసా’ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు.  రెవెన్యూ కార్యాలయాల్లో కంప్యూటర్  ఆపరేటర్లు లేకపోవడం వల్ల తీవ్ర పరిపాలనా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వారి సేవలను తక్షణమే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని  మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

అనంతరం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసిన ట్రెసా ప్రతినిధుల బృందం.. వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏల నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు అయిన ఉద్యోగులకు సీపీటీ (కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్) నుంచి మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు కె. గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్. రమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.