పోడు పట్టాల కోసం ప్రగతిభవన్ ముట్టడి

పోడు పట్టాల కోసం ప్రగతిభవన్ ముట్టడి
  • క్యాంప్ ఆఫీస్ ముట్టడికి గిరిజన సంఘాల యత్నం
  • పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్
  • గిరిజనుల హామీలను నెరవేర్చాలని డిమాండ్ 
  • సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి గిరిజన సంఘాల నేతలు ప్రయత్నించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాలని  గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు.

దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే మోహరించిన పోలీసులు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని నిలువరించి.. పోలీసు వ్యాన్ లలో ఎక్కించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదుపులోకి తీసుకున్న గిరిజన సంఘాల నేతలను పీఎస్ లకు తరలించారు.