ఢాకా: బంగ్లాదేశ్మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులో ఈ నెల 17న బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) తీర్పు వెలువరించనుంది. గతేడాది విద్యార్థుల నిరసనల అణచివేత కేసులో ఆమె అమానుష చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. హసీనా, ఆమె ప్రభుత్వంలో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఖమాల్ను నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వ్యక్తులుగా ప్రకటించి విచారణ జరిపారు.
కాగా, ఈ ట్రిబ్యునల్‌ను “కంగారూ కోర్టు” అని, దాన్ని తన శత్రువులు నడుపుతున్నారని హసీనా ఆరోపించారు. ఇక, తీర్పు తేదీ ప్రకటనతో ఆమె పార్టీ అవామీ లీగ్ “ఢాకా లాక్‌డౌన్” పిలుపునిచ్చింది. దీంతో గురువారం ఉదయం నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
