హైదరాబాద్, వెలుగు: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావుకు దేశవ్యాప్తంగా పలువురు ఘన నివాళి అర్పించారు. ఆదివారం ఏపీలోని మంగళగిరిలో సీకే కన్వెన్షన్ హాల్‌లో ఆయన దశదిన కర్మ జరిగింది. ఈ సందర్భంగా దేశంలో ఉన్న శ్రీచైతన్య మెయిన్ బ్రాంచ్‌లలో సంతాప సభలు నిర్వహించి, బీఎస్ రావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొని సంతాపం తెలిపారు.

