ఉస్మానియా వర్సిటీలో.. అంబేద్కర్​కు నివాళి

ఉస్మానియా వర్సిటీలో.. అంబేద్కర్​కు నివాళి

సికింద్రాబాద్/ఖైరతాబాద్/ముషీరాబాద్/షాద్ నగర్, వెలుగు : సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా వర్సిటీలో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ల అజయ్ ఆధ్వర్యంలో లా కాలేజీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్టూడెంట్లు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నండ్రు నరసింహ, మాతంగి ఓదెలు, రుషిపాక గణేశ్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఓయూలో బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో అంబేద్కర్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.

సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ లాలాగూడ బ్రాంచ్ ఆధ్వర్యంలో, ఓయూ లా కాలేజీలో ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో, సనత్​నగర్ సెగ్మెంట్​లో కాంగ్రెస్ నేత కోట నీలిమ ఆధ్వర్యంలో, షాద్ నగర్​లో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో  అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. బన్సీలాల్ పేటలోని జబ్బార్ కాంప్లెక్స్, ఐడీహెచ్ కాలనీ, పద్మారావునగర్, పాటిగడ్డ, బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో కార్యక్రమాలు జరిగాయి. న్యూ బోయిగూడలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి, బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి విజయా రెడ్డి ఖైరతాబాద్ లోని రైల్వే గేట్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.