
- సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు
నిర్మల్, వెలుగు : బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని వీసీ ప్రొఫెసర్ గోవర్దన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండడంతో ఆయన ప్రకటన విడుదల చేశారు.
అడ్మిషన్లకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని స్టూడెంట్లు నమ్మొద్దని సూచించారు. నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ప్రభుత్వానికి లెటర్ రాశామని, అక్కడి నుంచి పర్మిషన్ రాగానే అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ ఆర్జీయూకేటీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టడంతో పాటు పేపర్లలోనూ పబ్లిష్ చేస్తామని పేర్కొన్నారు.