ఇంత దుర్మార్గం ఏంట్రా : ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపేశారు..

ఇంత దుర్మార్గం ఏంట్రా : ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపేశారు..

ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. కౌశాంబి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేశారు దుండగులు. అర్థరాత్రి ఇంట్లో చొరబడి తండ్రీ, కూతురు, అల్లుడిని కాల్చి చంపారు. ఒకే కుటంబానికి చెందిన ముగ్గురి హత్య స్థానికంగా సంచలనంగా మారింది. ఆగ్రహించిన గ్రామస్తులు పరారీలో ఉన్న నిందితులను ఇండ్లకు నిప్పంటించారు.భూవివాదమే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. 

 
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహియుద్దీన్ పూర్ లో ఈ ఘటన జరిగింది. గురువారం (సెప్టెంబర్ 14) అర్థరాత్రి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు, అల్లుడిని దండుగులు కాల్చి చంపారు.  దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు నిందితుల ఇండ్లకు నిప్పు పెట్టారని పోలీసులు చెబుతున్నారు. భూ వివాదాలే ఈ హత్యకు కారణమని, ఈ ఘటనలో నలుగురు నిందితులను గుర్తించామని..  ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో పట్టు కుంటామని కౌశాంబి ఎస్పీ తెలిపారు. 

62 ఏళ్ల హోరీలాల్‌ అనే వ్యక్తికి పాండా చౌరహాలోని ఒక స్థలం విషయంలో కొంతమందితో వివాదం ఉంది. వివాదాస్పద స్థలాన్ని తన అల్లుడు స్వాధీనం చేసుకున్నాడు. అయితే గురువారం హోరీలాల్, అతని కూతురు, అల్లుడి హత్య జరిగింది. ఈ ఘటన తర్వాత మృతుడి చుట్టు పక్కల వారు కనిపించకుండా పోవడంతో స్థానికులు వారి మద్దతుదారుల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు.