ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ ను టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితులు అడ్డుకున్నారు. దళితబంధు స్కీంలో తీరని అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మంత్రి కారు ముందు నిరసన చేపట్టారు. మంత్రి కాళ్లు పట్టుకొని దళితులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, ప్రజాప్రతినిధులందరూ ఎమ్మెల్యే సీతక్కకు సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాకు సత్యవతి ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ములుగు గడ్డ పై మంత్రి అడుగు పెట్టొద్దంటూ నినాదాలు చేశారు. వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా మంత్రిని అడ్డుకుని రోడ్డు పైనే బైటాయించారు.
