
బషీర్బాగ్, వెలుగు: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ (టీఆర్ఎస్-డీ) వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తెలిపారు. అభ్యర్థిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల మంజూషను ప్రకటించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం సమావేశం నిర్వహించారు.
విద్యావంతురాలైన మహిళకు పోటీ చేసే అవకాశం కల్పించామని, నియోజకవర్గ సమస్యలపై త్వరలో పాదయాత్ర చేపడతామన్నారు. అలాగే, బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు.