
రంగారెడ్డి: పోటీకి సై అంటున్న ఆశావహులు… భీ ఫాం లేకున్నా పోటీ చేస్తామంటూ నామినేషన్లు వేశారు. జడ్పీటీసీ, ఎంపీపీ రేసులోనే వర్గాలుగా విడిపోయిన సంఘటన జిల్లాలో నెలకొంది. ప్రధానంగా టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలనే దృఢ సంకల్పంతోనే ఆశావహులు చివరి వరకు వేచి చూశారు. టికెట్ దక్కకపోవడంతో పార్టీ కండువాలు మార్చి మరో పార్టీ నుంచి పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. అంతేకాకుం డా వ్యక్తిగత బల నిరూపణలో భాగంగాపార్టీ టికెట్లు దక్కని అసంతృప్తి నాయకులుబరిలో ఉన్నారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసవాదులు పెరిగిపోయారు. దీంతో పాత కార్యకర్తలు పోటీకి దూరమవుతున్నారు.ఇటీవల కాలంలో పార్టీలు మారిన నాయకుల అనుచరులకు టీఆర్ఎస్ టికెట్ దక్కడంతో పాత కార్యకర్తలు మరో వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొత్తగా పార్టీలో చేరి జడ్పీటీసీ, ఎంపీటీసీస్థానాలకు సిద్ధపడుతున్న అభ్యర్థులకు పాత కార్యకర్తలు మద్దతు పలికే అవకాశం కనిపించడంలేదు. ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న మాకు కాదని పార్టీలు మారిన నాయకులకు పదవులు ఇవ్వడంపై భగ్గుమంటున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం లో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు రగులుతోంది. ఈ పోరు ఎక్కడికి దారితీస్తుం దోనని అధికార పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు.
చెల్లెమ్మ అనుచరుడు తిరిగి కాంగ్రెస్ కు..
జిల్లాలో 7 మండలాల పరిధిలోని ఎంపీటీసీలకు,జడ్పీటీసీలకు మొదటి విడత నామినేషన్లు బుధవారంతో ముగిశాయి. నాలుగు మండలాల్లో పార్టీ నిర్ణయిం చిన అభ్యర్థులకు టికెట్లు కేటాయిం చారు. కానీ మిగిలిన మూడు మండలాల్లో రెబల్ బెడద ఉండే అవకాశం కనిపిస్తోంది.అంతేకాకుం డా టీఆర్ ఎస్ లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు వెనుతిరిగి కాంగ్రెస్ లో టికెట్‌ను దక్కించుకుంటున్నారు. మొయినాబాద్ మండలంలో జడ్పీటీసీ స్థానం ఎస్సీ జనరల్ కావడంతో పోటీ మరింత పెరిగింది. ఇక్కడినుంచి చేవెళ్ల చెల్లెమ్మ అనుచరుడు దర్శన్ సైతం టీఆర్ ఎస్ టికెట్ ఆశించారు. కానీ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తనయుడు శ్రీకాంత్ బరిలో ఉండటంతో దర్శన్ టీఆర్‌ఎస్ నుంచి కాం గ్రెస్ లోచేరి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు.అంతేకాకుం డా ఇదే స్థానం నుంచి ఎంపీటీసీ డప్పు రాజు సైతం టీఆర్ ఎస్ టికెట్ ఆశించి భంగపడటంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారనిప్రచారం జరుగుతోం ది. ఇదే పరిస్థితి శంకర్ పల్లి,షాబాద్ మండలాల్లో సైతం ఉన్నట్లు సమాచారం.
వెనక్కి తగ్గేది ఎవరు?
జిల్లా పరిషత్తు చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో రాజకీయ నాయకులు వారసులను బరిలోకి దించేందుకు విశ్వ ప్రయత్నాలుచేశారు. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళగా రిజర్వ్ కావడంతో ఆశావహులు పెరిగిపోయారు.దీంతో ఈ స్థానం నుంచి ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్ , కాం గ్రెస్ పార్టీలు అధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఎంతమంది నామినేషన్లు వేసిన పార్టీ భీఫాం ఎవరికి ఇస్తే వారే బరిలో ఉంటారు.కానీ మిగిలిన ఆశావహులు బరి నుంచి వెనక్కి తగ్గుతారా లేదా అనే ప్రశ్న స్థానిక నేతల్లో చర్చసాగుతోం ది. మంచాల జడ్పీటీసీ స్థా నానికి టీఆర్ ఎస్ నుంచి అనిరెడ్డి శ్రీలక్ష్మి, మొద్దు శిరీ ష,అనిరెడ్డి అనితలు, కాంగ్రెస్ నుంచి మర్రి నిత్య,గుండబోని జయమ్మ, వెదిరే అరుణలు నామినేషన్లు దాఖలు చేశారు.