
నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నోముల హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. నోముల నెల రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. తర్వాత కరోనా నెగెటివ్ వచ్చినా కోలుకోలేదు. నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్, కేటీఆర్, పలువురు నేతలు సంతాపం తెలిపారు.
1999,2004 లో నోముల సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009 నుంచి భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2013లో టీఆర్ఎస్ లో చేరారు. 2014 నుంచి నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2018లో జానారెడ్డిపై పోటీ చేసి గెలిచారు నోముల.