అగో ఎన్నికలు.. ఇగో తాయిలాలు : గ్రేటర్​ ఎఫెక్ట్​తో రాబోయే ఎన్నికల్లో గట్టెక్కేందుకు టీఆర్​ఎస్​ పాట్లు

అగో ఎన్నికలు.. ఇగో తాయిలాలు : గ్రేటర్​ ఎఫెక్ట్​తో రాబోయే ఎన్నికల్లో గట్టెక్కేందుకు టీఆర్​ఎస్​ పాట్లు

పాత హామీల ఫైళ్లను ముందటేసుకుంటున్న రాష్ట్ర సర్కార్
నాగార్జునసాగర్​కు డిగ్రీ కాలేజ్​, లిఫ్టు స్కీములు
ఖమ్మం, వరంగల్‌, సిద్దిపేటకు ఐటీ పార్కులు
హడావుడిగా రిబ్బన్​ కటింగ్​లు, శంకుస్థాపనలు
గ్రేటర్​ ఎఫెక్ట్​తో రాబోయే ఎన్నికల్లో గట్టెక్కేందుకు టీఆర్​ఎస్​ పాట్లు

హైదరాబాద్‌, వెలుగు: దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల రిజల్ట్స్​ ఎఫెక్ట్​ రాబోయే ఎన్నికల మీద పడకుండా రాష్ట్ర సర్కారు ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తున్నది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నది. ఎన్నికలు జరిగే ఏరియాలకు తాయిలాలు ఇవ్వడం మొదలుపెట్టింది. నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఉండటంతో గతంలో చెప్పిన హామీల్లో కొన్నింటిని అమలు చేసేందుకు పూనుకుంది. ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌లకు కొత్త ఏడాదిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో అక్కడా కొత్త పనులకు పచ్చ జెండా ఊపింది. ఐటీ పార్కులను ప్రారంభించి యువతలో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని చూస్తోంది.

ఇకపై ప్రతి ఎన్నికపై స్పెషల్ ఫోకస్

టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తవుతుండటంతో ఇకపై జరిగే ప్రతి ఎన్నిక కీలకమేనని పార్టీ పెద్దలు
భావిస్తున్నారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలో విజయంతో ఊపుమీద కనిపించిన టీఆర్‌ ఎస్‌ కు దుబ్బాక ఓటర్లు చుక్కలు చూపించారు.
జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయింది అన్నట్టుగా 55 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా రెండు ఎన్నికల్లో
వచ్చిన ప్రతికూల ఫలితాలతో రాబోయే ప్రతి ఎన్నికను సీరియస్‌ గా తీసుకుంటున్నారు. పాత హామీల అమలుకు ప్రయత్నిం చడంతో పాటు
స్థాని కంగా కొన్ని పనులకు శంకుస్థాపనలు చేయాలని చూస్తున్నారు.