రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి !

రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి !

టీఆర్ఎస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం సరంపేట లో పోలింగ్ సరళి ని పరిశీలించడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన రాజ్ గోపాల్ రెడ్డి కన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఎంత సముదాయించినా వినకపోగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై దాడికి యత్నించారు. ఈ పెనుగులాటలో ఓ పోలీస్ అధికారి కాలువలో పడిపోయారు. ఫూటుగా  మద్యం సేవించి  పోలింగ్ బూత్ ల దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. 

పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో పోలింగ్ బూత్ ల దగ్గరకు వచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలు ఓవరాక్షన్ చేయడంపై స్థానిక ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపిక నశించిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. క్యూ లైన్ లో ఉన్న ఓటర్లను ప్రశాంతంగా ఓట్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

అటు శివన్న గూడెంలో  పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. పోలింగ్ కేంద్రంలోకి చొరబడేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కాన్వాయ్ పై కూడా రాళ్ల దాడికి యత్నించారు. బీజేపీ అభ్యర్థిపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలు తాగి వచ్చారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.