ఏఎస్‌‌‌‌వోలకు సూపరింటెండెంట్‌‌‌‌ పే స్కేల్‌‌‌‌ కల్పించాలి

ఏఎస్‌‌‌‌వోలకు సూపరింటెండెంట్‌‌‌‌ పే స్కేల్‌‌‌‌ కల్పించాలి

హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్​(ఏఎస్​వో)లకు సూపరింటెండెంట్ స్థాయి పే స్కేల్‌‌‌‌ కల్పించాలని సెక్రటేరియెట్ ఉద్యోగులు పే రివిజన్​కమిషన్‌‌‌‌ (పీఆర్సీ)ను కోరారు. బుధవారం బీఆర్‌‌‌‌కేఆర్‌‌‌‌ భవన్‌‌‌‌లో వారు పీఆర్సీ చైర్మన్‌‌‌‌ శివశంకర్​ను కలిసి తమ డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల్లో పనిచేసే సూపరింటెండెంట్‌‌‌‌ ఉద్యోగులతో సమానమైన పని, హోదా ఉన్నప్పటికీ ఏఎస్‌‌‌‌వోల జీతాలు వారికంటే తక్కువగా ఉన్నాయని, ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని కమిషన్‌‌‌‌ దృష్టి కి తీసుకెళ్లారు. 

ఈ సమావేశంలో సచివాలయ ఉద్యోగులు కందిమల్ల చలపతి రెడ్డి, దిలీప్, భూపాల్ రెడ్డి, రవీంద్ర, మీసాల రాజు తదితరులు పాల్గొన్నారు. టీఆర్టీఎఫ్  ఉద్యోగ, ఉపాధ్యాయులకు 40% ఫిట్ మెంట్ తో వేతన సవరణ చేయాలని టీఆర్టీయూ రాష్ట్ర కమిటీ పే రివిజన్​ కమిషన్‌‌‌‌ను కోరింది. ఈమేరకు బుధవారం పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్​ను ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులప్రతినిధి బృంధం కలిసి వినతిపత్రం అందించింది.