బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది C.I.D. (సిఐడి). మంగళవారం 23 డిసెంబర్ 2025న మంచు లక్ష్మి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యోలో 247’ యాప్ ప్రచారం అంశంపై మంచు లక్ష్మి స్టేట్‌మెంట్‌ను C.I.D. రికార్డు చేయనుంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద మంచు లక్ష్మిని సిఐడి ప్రశ్నించనుంది. బెట్టింగ్ యాప్ ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్ లపై అరా తియ్యనున్నారు CID అధికారులు. చట్టవిరుద్ధమైన యాప్ లకు ప్రమోషన్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది..? అనే కోణంలో కూడా CID విచారించి.. మంచు లక్ష్మి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది. మరి ఈ విచారణ అనంతరం మంచు లక్ష్మి ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ CID కీలక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, సోషియల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లు, యుట్యూబర్లపై కేసులు నమోదు చేసింది. 29 మందిపై కేసులు నమోదు చేసిన అనంతరం విచారణ చేస్తుంది సీఐడీ సిట్. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణు ప్రియ , సిరి హనుమంతు, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి విచారణ చేసింది సిట్ సిఐడి.
