Tasty Prawns Recipe : రొయ్యల పలావు, గార్లిక్ రొయ్యల కర్రీ టేస్టీగా.. 15 నిమిషాల్లో రెడీ అవుతుంది..!

Tasty Prawns Recipe : రొయ్యల పలావు, గార్లిక్ రొయ్యల కర్రీ టేస్టీగా.. 15 నిమిషాల్లో రెడీ అవుతుంది..!

రెగ్యులర్​ గా చికెన్, మటన్ కూరలు తిని బోర్ కొట్టినపుడు.. మనసు సీఫుడ్ మీదకు మళ్లుతుంది. అయితే, ముళ్లుంటాయని చాలామంది చేపల జోలికి పోరు. అలాంటి వాళ్లు రొయ్యల్ని లాగించొచ్చు. తరచూ ఫ్రాన్స్ తీసుకుంటే కావాల్సినంత బలం వస్తుంది. అతి తక్కువ ఫ్యాట్ ఉండే మాంసాహారం ఇది. మరెందుకు ఆలస్యం   రొయ్యలతో వెరైటీ వంటకాలను తయారుచేసికొని  విందు చేసుకోండి.

రొయ్యల పులావ్ తయారీకి కావాలసినవి

  • రొయ్యలు: అర కిలో
  • బాస్మతి రైస్ :అరకిలో
  •  ఉల్లిపాయలు: 2
  •  టొమాటో: 2
  •  అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2 టీస్పూన్లు 
  • పచ్చిమిర్చి: 2
  •  లవంగాలు : 6
  • దాల్చిన చెక్క: కొంచెం
  •  యాలకులు: 3
  •  బిర్యానీ ఆకులు: 2
  •  మిరియాల పొడి 1 టీస్పూన్ 
  • పసుపు: చిటికెడు 
  • కారం: 1 టీస్పూన్ 
  • ఉప్పు: సరిపడా 
  • నూనె: తగినంత 
  • కొత్తిమీర తరుగు కొంచెం

తయారీ విధానం:  బాస్మతి రైస్ ను బాగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి. రొయ్యలను కూడా శుభ్రంగా కడిగి అర టీస్పూన్ చొప్పున ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పక్కన పెట్టాలి. బియ్యం నానిన తర్వాత సరిపడా నీళ్లు పోసి అందులో బిర్యానీ ఆకు, సగం లవంగాలు, దాల్చిన చెక్క, ఉప్పు వేసి అన్నం ముప్పావు వంతు ఉడికించాలి.పాన్​ లో నూనె వేడిచేసి మిగిలిన మసాలా దినుసులు బిర్యానీ ఆకు లవంగం, దాల్చిన చెక్క, యాలకులు వేగించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు వేసి నాలుగు నిమిషాలు ఫ్రై చేయాలి.  అందులో మారినేట్ చేసుకున్న రొయ్యలు చేసి బాగా కలిపి అరకప్పు నీళ్లు పోసి మీడియం మంటపై 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత అన్నం కలిపి మూత పెట్టాలి.
ఐదు నిమిషాలు అయ్యాక పులావ్ ను బాగా కలిపి కొత్తిమీర, మిరియాలు పొడి చల్లి పాన్ దించేస్తే నోరూరించే రొయ్యల పులావ్ రెడీ.

ALSO READ : చలికాలంలో కళ్లు పొడిబారుతున్నాయా...

గార్లిక్ రొయ్యలు తయారీకి కావలసినవి:

  • రొయ్యలు: కిలో
  •  వెల్లుల్లి : 12 రెబ్బలు 
  • నిమ్మరసం: 2 టీస్పూన్లు
  •  ఉల్లిపాయ :1(పెద్దది) 
  • మిరియాల పొడి : 1 టీస్పూన్ 
  • వెన్న :2 టేబుల్ స్పూన్లు 
  • ఎండుమిర్చి గింజలు: అర టీస్పూన్ 
  • అలివ్ ఆయిల్ టేబుల్ స్పూన్ 
  • ఉప్పు :తగినంత
  •  రాక్ సాల్ట్​:  అరటీస్పూన్
  • కొత్తిమీర తరుగు:కొంచెం

తయారీ విధానం:  రొయ్యలను శుభ్రంగా కడిగి.. ఉప్పు కలిపి పక్కన పెట్టాలి.O పాన్​లో వెన్న,ఆలివ్ ఆయిల్ వేడి చేసి వెల్లుల్లిరెబ్బల తరుగు వేయాలి. అవివేగాక రొయ్యలు కూడా వేసి ఐదు నిమిషాలు చిన్న మంటపై ఉడికించాలి.  తర్వాత ఎండుమిర్చి గింజలు, రాక్ సాల్ట్, మిరియాల పొడి వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు వేగించాలి.చివరగా సరిపడా ఉప్పు నిమ్మరసం వేసి పాన్ దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసిన గార్లిక్ రొయ్యలు సైడ్ డిష్ బాగుంటాయి....