కెనడాకు బయల్దేరిన ట్రూడో

కెనడాకు బయల్దేరిన ట్రూడో

   సాంకేతిక లోపంతో నిలిచిన విమానం
  న్యూఢిల్లీ: ఎట్టకేలకు  కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్​ నుంచి తమ దేశానికి వెళ్లిపోయారు. జీ20 సమిట్​లో పాల్గొనేందుకు ట్రూడోతో పాటు ఆ దేశ ప్రతినిధులు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం తిరిగి బయలుదేరాల్సి ఉండగా.. విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్​ తలెత్తింది. దీంతో వారు ఇక్కడే చిక్కుకుపోయారు. సమస్య మంగళవారం పరిష్కారం కావడంతో మధ్యాహ్నం 1:10 గంటలకు ట్రూడో, ఆయన బృందం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు.

భారత ​ఎంబసీని మూసేయాలె..

కెనడాలోని ఒట్టావాలో ఉన్న భారత ఎంబసీని మూసేయాలని, హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను వెనక్కి పిలవాలని ఖలిస్తానీ గ్రూప్ మంగళవారం బెదిరింపు కాల్ చేసింది. కెనడా ప్రధాని మన దేశంలో ఉన్న టైంలోనే ఈ కాల్ వచ్చింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. 48 గంటల్లో ఇలాంటి కాల్​ రావడం ఇది రెండో సారి.
మోదీ, అమిత్​షా, జైశంకర్​లకు బెదిరింపులుసిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్​ఎఫ్​జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్‌‌లపై బెదిరింపులకు పాల్పడ్డాడు. “హర్దీప్ సింగ్ నిజ్జర్​ను హత్య చేసిన వారికి ఇది సందేశం. మీ చావు కోసం మేము పిలుపునిస్తున్నాం.. మోదీ, జైశంకర్, దోవల్, అమిత్ షా..  మేము మీ కోసం వస్తున్నాం” అంటూ పన్నూన్ బెదిరించారు.