న్యూఢిల్లీ: ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ప్రభావం భారత్‌పై ఉండదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) తెలిపింది. భారత్, ఇరాన్ మధ్య ప్రధానంగా ఆహారం, మందుల వంటి వాణిజ్యం మాత్రమే జరుగుతోంది. ఇవి అమెరికా ఆంక్షల పరిధిలోకి రావని ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ వివరించారు.
2024-–25 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్‌తో భారత్ వాణిజ్యం 1.68 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో ఎగుమతులు 1.24 బిలియన్ డాలర్లు. చాబహార్ ఓడరేవు అభివృద్ధి కూడా రెండు దేశాల మధ్య కీలకంగా ఉంది. భారత ఎగుమతిదారులు ఇప్పటికే యూఎస్ విధించిన 50 శాతం సుంకాలతో ఇబ్బంది పడుతున్నారు.
