
వాషింగ్టన్: అమెరికా ప్రజలు తన కంటే అమెరికా మెడికల్ ఎక్స్‌పర్ట్‌నే ఇష్టపడుతున్నారని, తనని కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘నేనంటే ఎవరికీ ఇష్టం లేదు’ అని వైట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో అన్నారు. ‘ఫౌచీని తన ప్రభుత్వమే నియమించింది, కరోనా నియంత్రణపై డాక్టర్ ఫౌచీ, డాక్టర్ బిర్క్స్‌తో సహావైద్య నిపుణులు చెప్పిన సూచనలనే మా ప్రభుత్వం అమలు చేస్తోంది. కానీ నా కంటే వాళ్లకే ప్రజాదరణ లభిస్తోంది. అసలు నాకే అత్యంత మద్దతు రావాల్సిఉండగా.. మా ప్రభుత్వం కోసం పనిచేసే వ్యక్తికి ప్రజాదరణ రావడం ఏంటి. బహుశా నా వ్యక్తిత్వమే దానికి కారణం” అని ట్రంప్ అన్నారు. కరోనా వైరస్ కట్టడిలో ట్రంప్ ఫెయిల్ అయ్యారని మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా.. ప్రజలు మొదటి నుంచి ఫౌచీ చెప్పిన సూచనలను ఎంతో నమ్మకంగా పాటిస్తున్నారు.