
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం డ్రగ్ (మెడిసిన్స్) ధరలను 59 శాతం తగ్గిస్తామని ప్రకటించారు. ఫార్మాస్యూటికల్స్‌పై కొత్త పాలసీని ఆదివారం ఆయన ఆవిష్కరించిన విషయం తెలిసిందే. "డ్రగ్ ధరలు 59 శాతం తగ్గుతాయి. గ్యాసోలిన్, ఎనర్జీ, గ్రాసరీస్ వంటి ఇతర ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇన్‌ఫ్లేషన్ లేదు!!!" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.
అమెరికాలో ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ధరలను "వెంటనే" 30 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకాలు చేస్తానని అన్నారు. ట్రంప్ "మోస్ట్ ఫేవర్డ్ నేషన్" (ఎంఎఫ్‌ఎన్) పాలసీని అమలు చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా కంపెనీలు అమెరికాలో విక్రయించే డ్రగ్స్ ధరలను, ఇతర దేశాలు ఆ డ్రగ్ కోసం చెల్లించే అత్యల్ప ధరకు అనుసంధానం చేయాలి.
అమెరికాలో ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ధరలను తగ్గించడం ద్వారా వచ్చే నష్టాలను, ఇతర దేశాలలో ధరలు పెంచడం ద్వారా కంపెనీలు బ్యాలెన్స్ చేసుకోవాలని ఆయన చెప్పారు. అమెరికాలో డ్రగ్ ధరలను తగ్గించడానికి ఇదేమి ట్రంప్ మొదటి ప్రయత్నం కాదు.
2017–-2021 మధ్య తన మొదటి టర్మ్‌లో, ఇలాంటి ప్రతిపాదనను ప్రకటించారు. కానీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనందున ఆ ప్లాన్స్ విఫలమయ్యాయి. కాగా, ట్రంప్ కొత్త పాలసీ వలన గ్లోబల్ ఫార్మా కంపెనీలు ఇండియా, ఇతర డెవలపింగ్ మార్కెట్లలో డ్రగ్ ధరలను పెంచాలని ఒత్తిడి చేయొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.