ఇరాన్-అమెరికా చర్చలు విఫలం కావడంతో ఈ యుద్ధం ఇక ఇప్పట్లో ముగిసేలా లేదని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. దీనికితోడు.. హార్మూజ్ జలసంధి దగ్గరికి అమెరికా నావికా దళాలను పంపించి దిగ్బంధం చేయడంతో యుద్ధం మరింత ముదురుతోందని అనుకున్నారు. హార్మూజ్ మీరు మూసేదేంటి.. మేమే మూసేస్తాం.. ఒక్క నౌక కూడా వచ్చేది లేదు.. బయటికి పోయేదిలేదని హెచ్చరించడం ఉద్రిక్తంగా మారింది.
అయితే యుద్ధంపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆల్మోస్ట్ ముగిసినట్లేనని మంగళవారం (ఏప్రిల్ 14) రాత్రి అన్నారు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో.. ఆల్మోస్ట్ ముగింపు దశకు చేరుకున్నాం. కానీ ఇరాన్ కాస్త బెట్టు చేస్తుందని అన్నారు. మేము ఇరాన్ పై మిలిటరీ ఆపరేషన్స్ చేయడంలేదు.. వాళ్లు మాత్రం అణ్వాయుధాల తయారీలో మునిగిపోయారు అని చెప్పుకొచ్చారు.
- మేము దాడి చేస్తే 20 ఏళ్ల వరకు కోలుకోలేరు..?
మేము దాడులను కొనసాగించాలని అనుకోవడం లేదు.. కానీ ఇరాన్ అలాగే ఉంటే చెప్పలేం. ఈ సారి దాడి చేస్తే 20 ఏండ్ల వరకు ఇరాన్ కోలుకునే అవకాశం ఉండదని హెచ్చరించారు. చూడాలి చర్చలు మరోసారి జరపాలని అనుకుంటున్నాం. ఈ రెండు రోజులు చాలా కీలకం. మరోసారి పాకిస్తాన్ లో చర్చలు జరుపుతాం.. అంటూ ట్రంప్ కామెంట్ చేశారు.
- ఇరాన్ పోర్టుల దిగ్బంధం కొనసాగుతుంది:
మరోవైపు ఇరాన్ పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTOM) ప్రకటించింది. ఇరాన్ పోర్టుల బ్లాకేడ్ లో భాగంగా భారీ ఎత్తున దళాలలను పంపినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ ఎకనామి 90 శాతం వరకు వాణిజ్యం ద్వారానే నడుస్తుంది. ఇప్పుడు యూఎస్ దళాలు పూర్తిగా ఇరాన్ ను బంధించామని.. వాణిజ్య రాకపోకలను కూడా స్తంభింపజేసినట్లు తెలిపారు.

