ఎంసెట్ బైపీసీ విద్యార్థుల‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్

ఎంసెట్ బైపీసీ విద్యార్థుల‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్

టీఎస్ ఎంసెట్ ద్వారా ఫార్మసీ, బ‌యోటెక్నాల‌జీ కోర్సుల్లో ప్రవేశం పొందాల‌నుకునే బైపీసీ విద్యార్థుల‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజైంది. బీ ఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మాస్యూటిక‌ల్ ఇంజినీరింగ్, బ‌యో మెడిక‌ల్ ఇంజినీరింగ్, బ‌యోటెక్నాల‌జీ కోర్సుల్లో ఈ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందొచ్చు.

సెప్టెంబ‌ర్ 2, 3 తేదీల్లో బైపీసీ విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్  4, 5 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.  ఆ తర్వాత  సెప్టెంబర్ 7  వ‌ర‌కు ఎంసెట్ బైపీసీ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11వ తేదీన బీ ఫార్మసీ, ఫార్మ్ డీ తొలి విడత సీట్ల కేటాయింపు చేస్తారు. సెప్టెంబ‌ర్ 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 23న ఫార్మా, బ‌యోటెక్నాల‌జీ కోర్సుల‌కు తుది విడత సీట్లను కేటాయిస్తారు.  సెప్టెంబ‌ర్ 24న స్పాట్ అడ్మిష‌న్ల మార్గద‌ర్శకాలు విడుద‌ల అవుతాయి.