విద్యావలంటీర్లకు ఏ చింతా లేదింకా.

 విద్యావలంటీర్లకు ఏ చింతా లేదింకా.

హైదరాబాద్‍, వెలుగు: ఏటా విద్యా వలంటీర్లను కొత్తగా ఎంపిక చేసుకునే పద్ధతికి హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పుతో తెర పడింది. ఈ తీర్పుతో ఉద్యోగ భద్రతపై విద్యా వలంటీర్లకు భరోసా పెరిగింది. శాశ్వత నియామకాలు పొందే వరకు ఆ స్థానంలో విద్యావలంటీర్లను కొనసాగించాల్సి ఉంటుం ది. అలాగే రిటైరయ్యే పర్మినెంట్‍ ఉపాధ్యాయుల స్థానంలో కూడా విద్యా వలంటీర్లను ఎంపిక చేసుకొని ఆయా స్థానంలో టీచర్‍ రిక్రూట్ మెంట్‍ ద్వారా పర్మినెంట్ ఉపాధ్యాయుల నియామకం అయ్యేదాకా వీరిని కొనసాగిం చాలి. తాజాగా జిల్లాలోవచ్చే అకడమిక్ నుంచి ప్రారంభం నుంచే విద్యావాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019–-20 విద్యా సంవత్సరానికి పదవీ విరమణ చేయనున్న టీచర్లు,టీఆర్‌‌‌‌‌‌‌‌టీ కింద కొత్తగా చేరనున్న ఉపాధ్యాయులవివరాలతో పాటు.. వలంటీర్లు ఎంతమంది అవసరమో మార్చి నెలాఖరులోగా నివేదికలుపంపాలని విద్యశాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం .

 దాదాపు 800 మందికి లబ్ధి

జిల్లాలో దాదాపు 800 మంది విద్యా వలంటీర్లకు హై కోర్టు తీర్పుతో లబ్ధి చేకూరనుంది. 182 హైస్కూల్స్, 686 ప్రైమరీ, అప్పర్‍ ప్రైమరీ స్కూల్స్ఉన్నాయి. సకాలంలో ఉపాధ్యాయుల ఖాళీలనుగుర్తిం చి వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదు.గతేడాది టీఆర్‌‌‌‌‌‌‌‌టీ ప్రకటన విడుదలైంది. విడతలవారీగా ఫలితాలను ప్రకటిస్తు న్నారు. టీచర్‍ రిక్రూట్ మెం ట్ ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కి రావడం లేదు.కొందరు అభ్యర్థులు కోర్టుకు పోవడంతో టీఆర్టీ నియామకాల ప్రక్రియ ఆగిపోయిం ది. ఇంకా టీఆర్ టీ ఎస్జీటీ(తెలుగు) ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 15661 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాకూడా కేవలం 8792 పోస్టులకు మాత్రమే టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేశారు. టీఆర్టీ రాత పరీక్షల ప్రక్రియ పూర్తైనా తుది ఫలితాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోం ది.

వేతన పెంపుతో పెరిగిన డిమాండ్‍

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేస్తామని  ఒకవైపు ప్రభుత్వం చెబుతున్న వాస్తవపరిస్థితి మాత్రం అందుకు భిన్నం గా ఉంది. ఏండ్ల నుంచి ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వ విద్య ప్రతిష్టను తగ్గిస్తుంది. ఈ అకడమిక్ లోనే నూతన ఉపాధ్యాయులను నియమిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదు. మరో రెండు వారాల్లో విద్యా సంవత్సరం ముగుస్తుం ది. ఇక నూతన టీఆర్ టీ ద్వారా టీచర్ల నియామకం ఇక వచ్చే అకడమిక్‍ ఇయర్ లోనే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన విద్యావలంటీర్లను కొనసాగిం చాలని హైకోర్టుఇటీవల తీర్పునిచ్చింది. పాత వారిని పునరుద్ధరిం చాలని సూచించిం ది. జిల్లాలో నూతన ఉపాధ్యాయుల భర్తీ చేయగా మిగిలిన స్థానాల్లో విద్యా వలంటీర్లను కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా వచ్చిన తీర్పు ఆధారంగా ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.గతంలో విద్యా వలంటీర్లకు ఒక్కొ క్కరికి రూ.8వేల వేతనం ఇచ్చేవారు. గత ఏడాది నుంచి రూ.12000లకు పెం చారు. దీంతో అభ్యర్థుల నుంచి స్పందన పెరిగింది.

హైకోర్టు తీర్పు భేష్‌

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లు సర్వీస్ వచ్చే విద్యాసంవత్సరం నుంచి రెన్యువల్ విధానంలో కొనసాగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడం శుభపరిణామం. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించి విద్యా వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.-కవిత, రాష్ట్ర కార్యదర్శి,

ఆందోళన తగ్గింది

ఇప్పుడు కొనసాగుతున్న విద్యా వలంటీర్లనురెన్యూవల్‍ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పునుస్వాగతిస్తు న్నాం. ఏటా ప్రభుత్వం విద్యా వలంటీర్లనియామకాల కోసం ప్రకటన విడుదలచేయడంతో ఉద్యోగం వస్తుందో రాదో అన్నఆందోళనతో ఉండేవారం. ఇప్పుడు ఆందోళనతగ్గింది.-శ్రీలత, విద్యా వలంటీర్‍