ప్రభుత్వం తీసుకుంది నాలుగెకరాలు.. కానీ పరిహారం ఇచ్చింది రెండెకరాలకే

ప్రభుత్వం తీసుకుంది నాలుగెకరాలు.. కానీ పరిహారం ఇచ్చింది రెండెకరాలకే

ఇదేమని అడిగితే.. అది అంతే అని బెదిరిస్తున్న రెవెన్యూ అధికారులు

న్యాయం చేయాలంటున్న బాధితులు

మహబూబ్ నగర్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రెండు ఎకరాలకు నష్ట పరిహారం చెల్లించి రెవెన్యూ అధికారులు నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు శ్రీపతి చెన్నమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  1996లో అప్పటి ప్రభుత్వం తన భర్త శ్రీపతి నాగయ్య, బావ సోమయ్యలకు పిల్లలమర్రి రెవెన్యూ శివారులో గల 349 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమి 4 ఎకరాలు ఇచ్చినట్లు తెలిపారు. నాటి నుండి నేటి వరకు కబ్జాలో ఉండి ఎలగటి పంటలు సాగు చేస్తున్నామన్నారు. ఇటీవల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 2 ఎకరాలు రోడ్డుకు పోగా రెండు విడతలుగా రెండు ఎకరాలకు నష్ట పరిహారం చెల్లించినట్లు తెలిపారు. మిగతా 2 ఎకరాలకై తెలంగాణ ప్ర భుత్వం అందిస్తున్న కొత్త పాస్‌ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు తమను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఇంకా 2 ఎకరాలు ఉందని అధికారులకు వివరించే ప్రయత్నం చేసినా నష్ట పరిహారం చెల్లించాం.. కాబట్టి భూమి వద్దకు రావద్దని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌కు సైతం పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.