మార్చి 7 నుంచి ఐసెట్ అప్లికేషన్లు..

మార్చి 7 నుంచి ఐసెట్ అప్లికేషన్లు..

హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రవేశపరీక్ష నోటిఫికేషన్​ను మార్చి5న రిలీజ్ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. శనివారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఐసెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, ఎస్​కే మహమూద్, కేయూ వీసీ రమేశ్ తదితరులు ఐసెట్ షెడ్యూల్​రిలీజ్ చేశారు. మార్చి 7 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.250 లేట్ ఫీజుతో మే17 వరకు, రూ.500 ఫైన్ తో మే 27 దాకా అప్లై చేసుకోవచ్చని సూచించారు. జూన్ 4,5 తేదీల్లో ఐసెట్ పరీక్ష ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఐసెట్ కన్వీనర్  నర్సింహాచారి, కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. 

మే 23న ఎడ్​సెట్​ ఎగ్జామ్​

బీఈడీ కోర్సులో అడ్మిషన్లకు నిర్వహించే ఎడ్ సెట్ అప్లికేషన్ల ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రొ. లింబాద్రి, ఎంజీయూ వీసీ గోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం కౌన్సిల్​లో ఎడ్ సెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షెడ్యూల్ ను విడుదల చేశారు.  మార్చి 4న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు వారు చెప్పారు. మార్చి 6 నుంచి మే 6 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లేట్ ఫీజుతో మే 13 వరకు చాన్స్​ఉందని, మే 23న ఎడ్ సెట్ ఎగ్జామ్ ఉంటుందని పేర్కొన్నారు.